Foxtail Millet Benefits
కొర్రలు వల్ల ఉపయోగాలు
Image Source - Google | Image By Name: uppadasarees
|
గుండె జబ్బులు: కొర్రలు రక్తపోటును నియంత్రించడంలో సహాయ పడతాయి,దీనివల్ల కార్డియాక్ అరెస్ట్ లేదా స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఇది శరీరంలో ఎల్డిఎల్ కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్ కంట్రోల్: కొర్రలు తక్కువ గ్లైసెమిక్ ను కలిగి ఉండటం వల్ల రక్తంలో చక్కెర తగ్గించి డయాబెటిస్ ని కంట్రోల్ చేస్తుంది.
మల బద్ధకం:జీర్ణక్రియను మెరుగుపరచి మల బద్ధకాన్ని దూరం చేస్తుంది,బలాన్ని పెంచుతుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడుతుంది.కొర్రలు (Foxtail Millet) రోగ నిరోధక శక్తిని పెంచుతాయి
Foxtail Millet
యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది: కొర్రలు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన వ్యాధులపై పోరాడటానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిద్రలేమి మరియు మైగ్రేన్ తలనొప్పి తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
క్యాన్సర్తో పోరాడుతుంది: కొర్రలు లో ఫైబర్ అధికంగా ఉంటుంది.మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను నివారించడంలో సహాయపడతాయని అధ్యయనాలు వెల్లడించాయి.
కాల్షియం: కొర్రలు కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలకు బలాన్నిస్తాయి. ఇందులో విటమిన్ డి కూడా ఉంటుంది. మొలకల రూపంలో కొర్రలను తినడం వల్ల ఎముకల వ్యాధి రానివ్వదు.
బరువు తగ్గడం: కొర్రాల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉండటం వల్ల ఆకలి త్వరగా కాదు. మీ డైట్లో కొర్రలను చేర్చుకోవడం ద్వారా, మీరు యవ్వనంగా కనిపించే చర్మాన్ని పొందుతారు, ఎందుకంటే ఇందులో ఉండే అమైనో ఆమ్లం చర్మం పై ముడతలు రాకుండ చేస్తాయి.
0 comments:
Post a Comment